భారత క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీలలో ఎవరు ఉత్తమ టెస్ట్ బ్యాటర్ అనే విషయంపై ఏబీ డివిలియర్స్ మాట్లాడాడు. విదేశాల్లో టెస్టుల్లో సచిన్‌తో పోలిస్తే.. విరాట్ కోహ్లీనే మెరుగైన బ్యాటర్ అని వ్యాఖ్యానించాడు. విదేశీ సీమింగ్ పిచ్‌లపై ఆసియా బ్యాటర్లు ఆడగలరని సచిన్ బాటలు వేస్తే, కోహ్లీ దానిని మరో స్థాయికి తీసుకెళ్లాడని కొనియాడాడు. రికార్డుల పరంగా సచిన్ ముందున్నా, విదేశాల్లో జట్టు గెలుపు ధోరణిని మార్చడంలో కోహ్లీ ప్రభావం స్పష్టంగా ఉందని వ్యాఖ్యానించాడు.


