సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, న్యాయవ్యవస్థపై వ్యాఖ్యలు చేసిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు సుప్రీంకోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. న్యాయవ్యవస్థపై దాడులు చేయడం దురదృష్టకరమని సీజేఐ వ్యాఖ్యానించారు. మరోవైపు.. తనను రాజకీయ కారణాలతో లక్ష్యంగా చేసుకుంటున్నారని సంజర్ రౌత్ ఆరోపిస్తూ.. జైలుకు వెళ్లడానికైనా సిద్ధమని ప్రకటించారు.


