కోపంతో అలిగి వెళ్లిపోయిన భార్య, కాపురానికి తిరిగి రాలేదనే మనస్తాపంతో ఓ వ్యక్తి వేలు కోసుకున్న ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. రామకుప్పం మండలం గాంధీనగర్‌కు చెందిన మంజునాథ్, అతని భార్యకు ఇటీవల గొడవ జరిగింది. మంజునాథ్ మద్యానికి బానిసగా మారటంతో.. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం కూడా అలాగే గొడవ జరిగింది. దీంతో అతని భార్య పుట్టింటికి వెళ్లిపోగా.. తిరిగి తీసుకురావడానికి వెళ్లాడు మంజునాథ్. అయితే కాపురానికి వచ్చేందుకు ఆమె అంగీకరించకపోవటంతో మనస్తాపంతో చూపుడు వేలు కోసుకుని అత్తింటి ముందు పడేశాడు.
చిత్తూరు: భార్య కాపురానికి రాలేదని.. వేలు కోసుకుని అత్తింటి ముందు పడేసిన అల్లుడు..
RELATED ARTICLES


