సినీ పరిశ్రమలో అవకాశాల పేరుతో సాగే లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ సంస్కృతిపై ప్రముఖ నటి నీతి టేలర్ తీవ్ర ఆరోపణలు చేశారు. కెరీర్ ఆరంభంలో సౌత్‌లో తాను రెండు చిత్రాలు చేశానని, తొలి చిత్రం పూర్తయ్యాక అదే దర్శకుడు రెండో ప్రాజెక్ట్ కోసం ఫోన్ చేసి అసభ్యకర డిమాండ్ చేశాడని తెలిపారు. సినిమా కావాలంటే తనతో శారీరకంగా రాజీపడాలని షరతు పెట్టడంతో మైండ్ బ్లాంక్ అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఆ నంబర్‌ను బ్లాక్ చేసి, తల్లికి చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకున్నానని పేర్కొన్నారు. ఆ ఒక్క చేదు సంఘటనతో సినిమాలకు పూర్తిగా దూరమై టీవీ రంగానికే పరిమితమైనట్లు ఆమె వెల్లడించారు
‘కోరిక తీరిస్తేనే సినిమా ఛాన్స్ ఇస్తానన్నాడు’… తెలుగు డైరెక్టర్‌పై నీతి టేలర్ సంచలన ఆరోపణలు
RELATED ARTICLES


