పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ నాలుగో రోజున దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్ మార్కో జాన్సెన్ ఐదు వికెట్లతో చెలరేగడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో కేవలం 99 పరుగులకే కుప్పకూలింది. దీంతో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా ఫాలో-ఆన్ ఆడించాడు. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (87*) ఒంటరి పోరాటం చేస్తున్నప్పటికీ ఆస్ట్రేలియా ఇంకా 170 పరుగులు వెనుకబడి ఉంది.


