ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్లో నేపాల్, జపాన్ మ్యాచ్ వర్షార్పణమైంది. ఈ ఫలితంతో ఆతిథ్య జపాన్ టోర్నీ నుంచి నిష్క్రమించగా, నేపాల్, అఫ్గానిస్థాన్ గ్రూప్-ఏ నుంచి క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించాయి. ఈ ఫలితంతో క్వార్టర్ ఫైనల్స్‌లో రెండు మ్యాచులు ఖరారయ్యాయి. క్వార్టర్స్‌లో అఫ్గానిస్థాన్‌తో భారత్, శ్రీలంకతో నేపాల్ తలపడనున్నాయి. క్రితం ఏషియన్ గేమ్స్ ఫైనల్లో భారత్, అఫ్గానిస్థాన్ జట్లే తలపడటం గమనార్హం. ఈసారి ఈ రెండు జట్లు క్వార్టర్స్‌లో తలపడనున్నాయి.


