Bank Strike September: సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు బ్యాంక్ ఉద్యోగులు 3 రోజుల పాటు సమ్మె నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఎస్బీఐ తన కస్టమర్లకు శుభవార్త అందించింది. ఈ 3 రోజుల్లో ఏ బ్యాంక్ ఏటీఎం నుంచి అయినా ఏటీఎం లావాదేవీలపై ఛార్జీల్ని మాఫీ చేస్తున్నట్లు తెలిపింది. డిజిటల్ బ్యాంకింగ్ సేవల్ని కూడా ఈ సమయంలో వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది.


