విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆదర్శ కుటుంబం’ విడుదలపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. అక్టోబర్ 2, 9 తేదీలు దాటిపోవడంతో వచ్చిన వాయిదా వార్తలను పటాపంచలు చేస్తూ, చిత్రయూనిట్ విజయదశమి సందర్భంగా అధికారిక పోస్టర్ ద్వారా విడుదల తేదీని ప్రకటించింది. అక్టోబర్ 30న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు. ఇటీవల ప్రెస్మీట్లో నిర్మాత నాగవంశీ సరదాగా మాట్లాడుతూ అక్టోబర్ 30న రావడమే ఖాయమని, వెంకటేష్‌తో స్వయంగా ట్రైలర్ లాంచ్‌లో ప్రకటింపజేస్తామని చెప్పారు. అయితే అంతకంటే ముందే మేకర్స్ అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేసి అభిమానులకు దసరా కానుక అందించడం విశేషం.
ఎట్టకేలకు సస్పెన్స్‌కు తెర… ఈ నెల 30న థియేటర్లలోకి వెంకీ-త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’
RELATED ARTICLES


