
దీపావళి బోనస్ రూపంలో 20 మంది ఉద్యోగులకు రూ.లక్ష చొప్పున నగదును గౌరవంగా అందించి వారి మనసు గెలుచుకున్నారు గుజరాత్ సూరత్ కు చెందిన వ్యాపారవేత్త రామ్ స్వరూప్.ఉద్యోగుల కష్టాన్ని గుర్తించి, వారి కుటుంబాల్లో దీపావళి సంతోషాలు నింపాలనే ఉద్దేశంతో ఆయన ఊహించనంత పెద్ద బోనస్ ఇచ్చి ఉద్యోగులను సంతోషపరిచారు.బోనస్ అందుకున్న ఓ మహిళా ఉద్యోగి సంతోషంతో భావోద్వేగానికి గురయ్యారు. తమ యజమాని చూపిన ప్రేమ, గౌరవానికి ఉద్యోగులంతా కృతజ్ఞతలు తెలిపారు.ఉద్యోగులను కేవలం పనివాళ్లుగా కాకుండా కుటుంబ సభ్యులుగా చూసుకునే ఇలాంటి యజమానులు సమాజానికి ఆదర్శమని పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#DiwaliBonus #Surat #Gujarat #Employee #GoodNews
#ksnnewstelugu
#ksntelugunews
#ksnnews
#ksnnews9-telugu


