ఏషియన్ గేమ్స్ 2026 మహిళల క్రికెట్లో సెమీఫైనల్స్ షెడ్యూల్ ఖరారైంది. సెప్టెంబర్ 20న జరిగే తొలి సెమీస్‌లో పాకిస్థాన్-శ్రీలంక, రెండో సెమీస్‌లో భారత్-బంగ్లాదేశ్ పోటీపడతాయి. క్వార్టర్స్‌లో భారత్ 8 వికెట్లతో జపాన్‌పై, లంక 86 రన్స్‌తో మలేషియాపై, పాక్ 3 వికెట్లతో థాయ్‌లాండ్‌పై గెలిచాయి. సెప్టెంబర్ 22న ఉదయం బ్రాంజ్ మెడల్, ఆ తర్వాత గోల్డ్ మెడల్ (ఫైనల్) మ్యాచ్‌లు జరుగుతాయి. క్రితం సారి ఏషియన్ గేమ్స్‌లో భారత మహిళల జట్టు స్వర్ణం సాధించింది.


