షుగర్ ఉన్నవారు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ ఫుడ్ తినాలి, ఎలా తినాలి? ఏ సమయంలో తీసుకోవాలి. ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుని తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. బ్లడ్ షుగర్ లెవల్స్ పెరిగితే బాడీలో చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి, ఎప్పటికప్పుడు వీటిని పరీక్షించుకుని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే పరిశోధకులు డయాబెటిస్ గురించి అనేక పరిశోధనలు చేస్తున్నారు. దీని గురించి తాజా అధ్యయనాల్లో తేలిన విషయం ఏంటంటే టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారు ఇంటెర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది. అయితే, తగ్గుతుంది కదా అని షుగర్ ఉన్న ప్రతీ ఒక్కరూ ఫాస్టింగ్ చేస్తామంటే కుదరదు. చేసేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.


