Andhra Pradesh Rains Today: బంగాళాఖాతంలో ఉత్తర అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఈనెల 21 లేదా 22వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడి తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి ప్రవేశించనుందని అంచనా వేస్తున్నారు. ఈనెల 24వ తేదీ తర్వాత అది ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటుతుందని అంచనా వేశారు. వాయుగుండం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా దిశగా వచ్చే క్రమంలో తుఫాన్‌గా మారుతుందంటున్నారు. ఈ నెల 21న దీనిపై క్లారిటీ వస్తుందని చెబుతున్నారు. మరోవైపు ఇవాళ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు.
అండమాన్‌లో అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష సూచన
RELATED ARTICLES


